Home  »  TV News  »  Happy Married Life New Web series : యూట్యూబ్ ట్రెండింగ్ లో హ్యాపీ మ్యారిడ్ లైఫ్ వెబ్ సిరీస్!

Updated : Apr 26, 2024

డాక్యుమెంటరీలు, లఘుచిత్రాలు , వెబ్ సిరీస్ లు ఇలా ప్రతీవారం యూట్యూబ్ లో కొత్త కంటెంట్ తో కొన్ని కథలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే వీటిల్లో ఏది ట్రెండింగ్ లో ఉందో ఓసారి చూసేద్దాం.

మావిడాకులు వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ పొందిన ప్రసాద్ బెహరా.. పెళ్ళివారమండి వెబ్ సిరీస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అయితే వీరి తరహాలోనే కొత్తగా " Happy Married Life" వెబ్ సిరీస్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ప్రతీ ఎపిసోడ్ రెండు లక్షల కంటే ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్నాయి. అసలు ఈ సిరీస్ కథేంటంటే.. మాయా అనే అమ్మాయికి వాళ్ళ అమ్మనాన్నలు  పెళ్ళిచూపులు సెట్ చేస్తారు. అయితే ఆ పెళ్ళిచూపులు ఇష్టం లేని మాయ తన ఫ్రెండ్ రాజీకీ కాల్ చేసి జరిగింది చెప్పి తనని సేవ్ చేయమని చెప్తుంది. ఇక అబ్బాయి వివరాలని తెలుసుకున్న రాజీ.. బస్ స్టాప్ లో ఉన్న అబ్బాయి(మహా) చూస్తుంది. పెళ్ళిచూపులకి తీసుకెళ్తానని మహా తో చెప్పి తన స్కూటీ మీద తీసుకెళ్తుంది రాజీ. ఇక దారిలో మహాతో తన ఫ్రెండ్ మాయా గురించి రాజీ మొత్తం చెప్తుంది. ‌ఇక ఆ పెళ్ళి చూపులు ఎలాగైన‌ చెడగొట్టమని రాజీ చెప్పగా.. సరేనంటాడు మహా. మరి పెళ్ళిచూపులకి వెళ్ళిన మహా .. రిజెక్ట్ చేశాడా లేదా? అసలు రాజీ ఎవరు లాంటి ట్విస్ట్ లతో ఈ కథ సాగుతుంది.

ఇలాంటి కొత్త కథల కోసం యూట్యూబ్ లో ఎంతోమంది వెతుకుతుంటారు. అయితే అందరు కొత్త నటులతో , కొత్త కథతో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతున్న ఈ వెబ్ సిరీస్ ని ఇప్పటివరకు చూడని వాళ్ళు ఓసారి చూసేయ్యండి. చూసినవాళ్ళు ఎలా ఉందో కామెంట్ చూసేయ్యండి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.